Loading...
Bhogapuram Airport: 'భోగాపురం' ప్రారంభోత్సవం రోజున గిన్నిస్‌ రికార్డే.. 13 వేల మందితో థింసా నృత్యం
13 వేల మందితో థింసా నృత్యం

Bhogapuram Airport: 'భోగాపురం' ప్రారంభోత్సవం రోజున గిన్నిస్‌ రికార్డే.. 13 వేల మందితో థింసా నృత్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయనగరం జిల్లా భోగాపురంలో ఆగస్టు 1న జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించే లక్ష్యంతో భారీ స్థాయిలో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించనుంది. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో 13 వేల మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు ఒకేసారి సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినూత్నంగా స్వాగతం పలికేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

వివరాలు 

కార్యక్రమం నిర్వహణ కోసం రూ.1 కోటి బడ్జెట్‌ కేటాయించిన ప్రభుత్వం

ప్రధాని ఓపెన్‌టాప్‌ జీపులో కార్యక్రమ ప్రాంగణానికి చేరుకునే సమయంలో అందరికీ స్పష్టంగా కనిపించే విధంగా పాల్గొనేవారిని మొత్తం 433 బృందాలుగా విభజించారు.

వృత్తాకారంలో నిలబడి ఏకకాలంలో థింసా నృత్యాన్ని ప్రదర్శించేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.

ఈ ప్రదర్శనలో పాల్గొనే మహిళలు, విద్యార్థినులు ఆకుపచ్చ అంచుతో కూడిన గులాబీ రంగు చీరతో పాటు ఆకుపచ్చ జాకెట్‌ను ధరించనున్నారు.

ఈ భారీ కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1 కోటి బడ్జెట్‌ను కేటాయించింది.

ADVERTISEMENT