US Open: సబలెంకాపై సంచలన విజయం.. యుఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా రిబకినా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 13, 2026
08:48 am
ఈ వార్తాకథనం ఏంటి
యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కజకిస్థాన్‌కు చెందిన రిబకినా సొంతం చేసుకుంది. ఫైనల్లో బెలారస్ స్టార్ సబలెంకాపై 6-4, 5-7, 6-2 తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. రిబకినాకు ఇదే తొలి యుఎస్ ఓపెన్ టైటిల్. ఈ విజయంతో మహిళల టెన్నిస్ అసోసియేషన్ (WTA) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లోనూ ఆమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తద్వారా డబ్ల్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్న తొలి కజకిస్థాన్ క్రీడాకారిణిగా రిబకినా చరిత్ర సృష్టించింది.