Loading...
Kochi Airport: కొచ్చి విమానాశ్రయంలో రోబో సేవలు.. ప్రయాణికులకు మరింత సౌకర్యం
కొచ్చి విమానాశ్రయంలో రోబో సేవలు.. ప్రయాణికులకు మరింత సౌకర్యం

Kochi Airport: కొచ్చి విమానాశ్రయంలో రోబో సేవలు.. ప్రయాణికులకు మరింత సౌకర్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాణికుల సేవలు, సౌకర్యాలను మరింత మెరుగుపర్చే ప్రయత్నాల్లో భాగంగా కొచ్చి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (సీఐఏఎల్‌) తన విమానాశ్రయంలో రోబోటిక్‌ సాయాన్ని ప్రవేశపెట్టింది. సీఐఏఎల్‌ శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. తొలి దశలో భాగంగా డొమెస్టిక్‌ సెక్యూరిటీ హోల్డ్‌ ఏరియాలోని కళాంగన్‌ ఆర్ట్‌ మ్యూజియంలో ప్రయాణికులకు సాయం చేసేందుకు ఒక రోబోను ఏర్పాటు చేసింది. ఈ రోబోను పుణెకు చెందిన కైనెటిక్స్‌ రోబోటిక్స్‌ అభివృద్ధి చేసింది. ఈ రోబో విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు స్వాగతం పలకడంతో పాటు విమానాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందిస్తుంది. అలాగే బోర్డింగ్‌ గేట్లు, ఇతర విమానాశ్రయ సౌకర్యాల వద్దకు ప్రయాణికులను తీసుకెళ్లడంలోనూ సాయం చేస్తుంది.

వివరాలు

స్పష్టం చేసిన కంపెనీ అధికారులు

అంతేకాకుండా సంప్రదాయ కళారూపాల గురించి సమాచారాన్ని అందించడం ద్వారా కేరళ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేలా రోబోను రూపొందించారు.

కళాంగన్‌లో ప్రదర్శించిన శిల్పాలు, ఇతర కళాఖండాల వివరాలను కూడా ప్రయాణికులకు ఈ రోబో అందిస్తుంది.

ఇక తదుపరి దశలో విమానాశ్రయంలోని చెక్‌-ఇన్‌ హాల్స్‌లో ప్రయాణికులకు సాయం చేసేందుకు మరిన్ని రోబోలను వినియోగించాలని సీఐఏఎల్‌ యోచిస్తోంది.

ఈ విషయాన్ని కంపెనీ అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT