Gujarat: డిపాజిట్‌పై పన్ను విధించి మినహాయించినందుకు.. బ్యాంక్ మేనేజర్‌పై దాడి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై పన్ను విధించి మినహాయించిన అంశం కారణంగా ఒక వ్యక్తి బ్యాంక్ మేనేజర్‌పై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై పన్నుపై మొదలైన వాగ్వాదం ఆ ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. జైమన్ రావల్ అనే కస్టమర్ శనివారం అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్ ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి,డిపాజిట్‌పై పెరిగిన పన్నుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈవిషయంపై బ్యాంక్ మేనేజర్‌తో మొదలైన వాగ్వాదం వారి మధ్య ఘర్షణకు దారితీసింది.
ఇతర బ్యాంకు సిబ్బందితో కూడా జైమన్ వాగ్వివాదం
ఇద్దరూ ఒకరినొకరు చొక్కా కాలర్ పట్టుకొని గొడవకు దిగగా,జైమన్ రావల్ మేనేజర్ తలపై కొట్టాడు. ఈఘటనను నివారించేందుకు అతడి తల్లి,బ్యాంకు సిబ్బంది ప్రయత్నించారు. అయితే,ఈ సమయంలో ఇతర బ్యాంకు సిబ్బందితో కూడా జైమన్ వాగ్వివాదానికి దిగాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, బ్యాంకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.