
Maharastra: మహారాష్ట్రలో బస్సు బోల్తా.. 10 మంది మృతి, పలువురికి గాయలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భందారా నుంచి గోండియా వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది వరకు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వివరాలు
కలెక్టర్‌కు ఆదేశాలు
ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోండియా జిల్లా సడక్ అర్జుని ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను ఆయన దురదృష్టకరమని అభివర్ణించారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఫడణవీస్, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు సమన్వయంతో చేపడుతున్నారని చెప్పారు.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.