LOADING...
Road Accident: లండన్‌లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతి
లండన్‌లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతి

Road Accident: లండన్‌లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతులను నాదర్‌గుల్ నివాసి తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంలో మరికొందరు కూడా గాయపడ్డారు. పోలీసుల సమాచారం మేరకు నలుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్సకు తరలించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.