LOADING...
Chevella Bus Accident: చేవెళ్ల రోడ్డు దుర్ఘటన.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
చేవెళ్ల రోడ్డు దుర్ఘటన.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

Chevella Bus Accident: చేవెళ్ల రోడ్డు దుర్ఘటన.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 19 మంది మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉస్మానియా ఆసుపత్రి నుండి వచ్చిన 12 మంది వైద్యుల బృందం ఈ పోస్టుమార్టం కార్యక్రమంలో పాల్గొంది. ఫోరెన్సిక్‌ విభాగం వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ ఎలాంటి మద్యం సేవించలేదని నిర్ధారించారు. ఇప్పటికే 18 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. చివరి మృతదేహం టిప్పర్‌ డ్రైవర్‌దిగా గుర్తించారు. దాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.

Details

విషాదంలో మునిగిపోయిన చేవెళ్ల 

డ్రైవర్‌ కుటుంబ సభ్యులు ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహాన్ని తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, డ్రైవర్‌ మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ ఇప్పటికే ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకుంది. ఈ దారుణ ఘటనతో చేవెళ్ల ప్రాంతమంతా విషాద వాతావరణంలో మునిగిపోయింది. గ్రామాల్లో ఒకే కుటుంబానికి చెందిన పలువురు మృతి చెందడంతో కన్నీటి సుడిగాలి వీచింది. అంత్యక్రియలకు సిద్ధమవుతున్న బాధిత కుటుంబాల వద్ద దుఃఖం, ఆవేదన తారస్థాయికి చేరింది.