Page Loader
Ethiopia: ఇథియోపియాలో ఘోర ప్రమాదం.. 71 మంది దుర్మరణం
ఇథియోపియాలో ఘోర ప్రమాదం.. 71 మంది దుర్మరణం

Ethiopia: ఇథియోపియాలో ఘోర ప్రమాదం.. 71 మంది దుర్మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2024
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇథియోపియాలోని బోనాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిదామా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్ళిన ట్రక్కు అదుపు తప్పి నదిలో పడటంతో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. డామా ప్రాంతం అధికారులు వెల్లడించిన ప్రకారం, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రయాణికులతో వెళుతున్న ట్రక్కు రోడ్డుపై నుంచి తప్పుకుని నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 68 పురుషులు, ముగ్గురు మహిళలు మృతి చెందారని తెలిపారు.

Details

వివాహానికి హాజరై తిరుగొస్తుండగా ప్రమాదం

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. మృతుల్లో కొందరు స్థానికంగా ఓ వివాహానికి హాజరై తిరుగు ప్రయాణం చేస్తున్నారని సమాచారం. పేద దేశమైన ఇథియోపియాలో సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానిక పోలీసు అధికారులు పేర్కొన్నారు.