LOADING...
Road Accident: యూపీలో భారీ ప్రమాదం.. భక్తులతో వెళ్తున్న వాహనం కాలువలో బోల్తా!
యూపీలో భారీ ప్రమాదం.. భక్తులతో వెళ్తున్న వాహనం కాలువలో బోల్తా!

Road Accident: యూపీలో భారీ ప్రమాదం.. భక్తులతో వెళ్తున్న వాహనం కాలువలో బోల్తా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2025
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌ గోండా జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పృథ్వీనాథ్‌ ఆలయ దర్శనానికి బయలుదేరిన భక్తుల బొలెరో వాహనం అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం పరాసరాయ్‌-ఆలవాల్‌ డియోర మార్గంలో రేహారి గ్రామం సమీపంలోని సరయూ కాలువ వంతెన వద్ద జరిగింది. ప్రమాదంలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల సమాచారం ప్రకారం, వాహనంలో మొత్తం 15 మంది ఉన్నారు. వీరిలో నలుగురిని స్థానికులు సజీవంగా రక్షించారు.

Details

ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి

మిగతా 11 మృతదేహాలను సరయూ నదిలో నుంచి వెలికి తీశారు. మృతులంతా మోతీగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిహాగావ్‌ గ్రామానికి చెందినవారని అధికారులు గుర్తించారు. ఈ దుర్ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ విషాదకర ఘటన తీవ్ర స్థాయిలో శోకాన్ని మిగిల్చింది.