NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Brazil: తూర్పు బ్రెజిల్‌లో బస్సు ప్రమాదం.. 23 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    Brazil: తూర్పు బ్రెజిల్‌లో బస్సు ప్రమాదం.. 23 మంది మృతి 
    తూర్పు బ్రెజిల్‌లో బస్సు ప్రమాదం.. 23 మంది మృతి

    Brazil: తూర్పు బ్రెజిల్‌లో బస్సు ప్రమాదం.. 23 మంది మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 25, 2024
    08:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రెజిల్‌లోని అలగోస్ రాష్ట్రంలో మారుమూల పర్వత రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు లోయలో పడటంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ దుర్ఘటన సోమవారం చోటుచేసుకోగా, ప్రాంతీయ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు.

    ఘటన స్థలంలోనే 22 మంది మరణించారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గర్భిణీ స్త్రీ మరణించినట్లు రెస్క్యూ బృందాలు తెలియజేశాయి.

    ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు తీవ్రంగా గాయపడినట్లు బ్రెజిల్ మీడియా నివేదించింది.

    ఈ ఘటన యునియావో డాస్ పాల్మారెస్ పట్టణం సమీపంలో చోటుచేసుకుంది.

    వివరాలు 

    మూడు రోజుల పాటు సంతాప దినాలు

    రాష్ట్ర గవర్నర్ పాలో డాంటాస్ ఈ విషాదకర ఘటన పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.

    సెర్రా డా బారిగా అనే పర్వత ప్రాంతం వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతం దుర్గమమైనదిగా, రవాణాకు క్లిష్టమైనదిగా భావించబడుతుంది. ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రెజిల్
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Shopian: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్
    DD Next level: వివాదంలో చిక్కుకున్న ప్రముఖ తమిళ హారర్ కామెడీ చిత్రం 'డీడీ నెక్స్ట్ లెవెల్'  కోలీవుడ్
    operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Sunil Gavaskar: 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌, విరాట్‌ ఆడరు: సునీల్‌ గావస్కర్‌ సునీల్ గవాస్కర్

    బ్రెజిల్

    బ్రెజిల్‌లో విధ్వంసం: అధ్యక్ష భవనం తలుపు బద్ధలుకొట్టి బోల్సొనారో మద్దతుదారులు బీభత్సం అంతర్జాతీయం
    బ్రెజిల్: బోల్సోనారో మద్దతుదారుల 'మెగా నిరసన' అట్టర్ ప్లాప్ అంతర్జాతీయం
    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం ఇండియా
    బ్రెజిల్‌లో డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం.. పోలీస్ కాల్పుల్లో 9 మంది దుర్మరణం అంతర్జాతీయం

    రోడ్డు ప్రమాదం

    Haryana: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన కారు .. 6 మంది మృతి, 6 మందికి గాయాలు హర్యానా
    Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి  మధ్యప్రదేశ్
    Car Accident: అదుపుతప్పి మార్కెట్ లోకి దూసుకెళ్లిన కారు... ఒకరు మృతి  దిల్లీ
    Afghanistan: రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా, 21 మంది మృతి ఆఫ్ఘనిస్తాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025