తదుపరి వార్తా కథనం
Road accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 26, 2025
01:02 pm
ఈ వార్తాకథనం ఏంటి
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ, ఆటోలపై దూసుకెళ్లంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మామునూర్ హైవేపై జరిగింది.
స్థానికులు తెలిపిన ప్రకారం, ఇనుప స్తంభాలను మోసే లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగిఉన్న ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా మొత్తం నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మరికొందరు ఇనుప స్తంభాల కింద ఇరుక్కుపోయారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.