Road Accident: కుంభమేళా నుంచి తిరుగొస్తుండగా ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ముగించుకుని తిరిగి వస్తున్న కొందరు తెలుగు యాత్రికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
వారు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టడంతో, ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ సమీపంలో మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతులు హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందినవారని పోలీసులు నిర్ధారించారు.
Details
ప్రమాదానికి కారణం ఏమిటి?
జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ హైవేపై రాంగ్ రూట్‌లోకి రావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు మినీ బస్సులో చిక్కుకుపోయారు.
స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి, చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని సిహోరా ఆసుపత్రికి తరలించారు.
Details
మృతుల పేర్లు తెలియాల్సి ఉంది
ప్రమాదానికి గురైన వాహనం నంబర్ AP29 W 1525గా గుర్తించారు. తొలుత మినీ బస్సు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ కావడంతో, పోలీసులు మృతులను ఏపీ వాసులని భావించారు.
అయితే మృతదేహాల వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా వారు హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందినవారని నిర్ధారించారు.
మృతుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.