తదుపరి వార్తా కథనం
Road accident: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మందికి గాయాలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 09, 2024
02:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
శనివారం తెల్లవారుజామున ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
కొల్హాపూర్ నుండి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు భోట్ ఘాట్ సమీపంలోని ఖోపోలిలోని ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటన ఉదయం 4 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో 23 మందికి గాయాలు కాగా, 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే ఐఆర్‌బీ యాంబులెన్స్ సర్వీస్‌కు చెందిన అంబులెన్స్‌లు ఘటన స్థలానికి చేరుకుని, గాయపడినవారిని కామోఠేలోని ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు.
బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.