తదుపరి వార్తా కథనం

Road Accident: విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం.. ఒకరు మృతి,11 మందికి గాయాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 08, 2024
08:06 am
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సు ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో ఒకరు మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విజయవాడ బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్‌కు విహారయాత్రకు వెళ్లారు.
మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో, ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
రాజేంద్రప్రసాద్‌తో పాటు మరో 11 మందికి గాయాలయ్యాయి, వీరికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.