Page Loader
Ben Stokes: ఇంగ్లండ్ కు భారీ ఎదురుదెబ్బ.. లంక సిరీస్ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ కు భారీ ఎదురుదెబ్బ.. లంక సిరీస్ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్

Ben Stokes: ఇంగ్లండ్ కు భారీ ఎదురుదెబ్బ.. లంక సిరీస్ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2024
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నారు. ది హండ్రడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్ చార్జర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టోక్స్.. మాంచెస్టర్ ఒరిజనల్స్‌తో జరిగిన మ్యాచులో గాయపడ్డారు. బ్యాటింగ్ అడుతున్న క్రమంలో స్టోక్స్ కండరాలు పట్టేశాయి. ఈ క్రమంలో గ్రౌండ్ లోనే పడిపోవడంతో ఫిజియోలు వెంటనే పరిగెత్తుకొచ్చి అతనికి చికిత్స అందించారు. ఇక స్కానింగ్ లో గాయం తీవ్రత ఎక్కువ కావడంతో శ్రీలంక టెస్టు సిరీస్‌కు స్టోక్స్ దూరమయ్యారు.

Details

ఇంగ్లండ్ కెప్టెన్ గా ఆలీ పోప్

బెన్ స్టోక్స్ గైర్హాజరీతో ఇంగ్లండ్ టెస్టుకు కెప్టెన్‌గా ఆలీ పోప్ నియమితులయ్యారు. ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే జాక్ క్రాలీ గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య ఆగస్టు 21 నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆగస్టు 29న రెండో టెస్టు, సెప్టెంబర్ 6 నుంచి ఓవల్ లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా జరిగే ఈ టెస్టు సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.