England vs Sri Lanka, Test Series: అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లపై ఓ లుక్కేయండి
ఇంగ్లండ్, శ్రీలంక క్రికెట్ టీమ్‌ల మధ్య ఆగస్టు 21 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌కు బెన్‌స్టోక్స్, శ్రీలంకకు ధనంజయ్ డిసిల్వా కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టెస్టులో శ్రీలంకపై ఇంగ్లండ్ కు మంచి రికార్డు ఉంది. తాజాగా వెస్టిండీస్‌ను 3-0తో ఇంగ్లండ్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లలోని ఏ ఆటగాళ్లు ఎక్కువ పరుగులు చేశారో తెలుసుకుందాం
మహేల జయవర్ధనే
శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్ మహేల జయవర్ధనే రెండు జట్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. 1998లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడగా, 2014లో చివరిసారిగా ఇంగ్లాండ్‌తో ఆడాడు. అతను 23 టెస్టుల్లో 41 ఇన్నింగ్స్‌ల్లో 2,212 పరుగులు సాధించాడు. ఇందులో మూడుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. అతని సగటు 58.21. అతను 8 సెంచరీలు మరియు 2 అర్ధ సెంచరీలు సాధించాడు.
కుమార్ సంగక్కర
శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మెన్ కుమార్ సంగక్కర ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు . 2001లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడాడు. అతను చివరిసారిగా 2014లో ఇంగ్లాండ్ జట్టులోనే ఆడడం గమనార్హం. అతను 22 మ్యాచ్‌లలో 40 ఇన్నింగ్స్‌లలో 1,568 పరుగులు చేశాడు, ఒకసారి నాటౌట్‌గా ఉన్నాడు. 40.20 సగటుతో 3 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 152 పరుగులు.
అలిస్టర్ కుక్
శ్రీలంక క్రికెట్ జట్టుపై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ అలిస్టర్ కుక్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఈ ఆటగాడు 2006లో శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడాడు. 16 మ్యాచ్‌లలో 28 ఇన్నింగ్స్‌లలో 4 సార్లు నాటౌట్‌గా నిలిచి 1,290 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 133 పరుగులు.
జో రూట్
ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 2014లో శ్రీలంకతో తొలి టెస్టు ఆడాడు. ఈ ఆటగాడు 10 మ్యాచ్‌ల్లో 18 ఇన్నింగ్స్‌ల్లో 1,0001 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 228 పరుగులు. ఈ టెస్టు సిరీస్‌లో రూట్ ఇంగ్లండ్ జట్టులో ఉన్నాడు.