తదుపరి వార్తా కథనం
IND vs SL : రెండో వన్డేలో శ్రీలంక గ్రాండ్ విక్టరీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 04, 2024
10:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక గ్రాండ్ విక్టరీ సాధించింది. లంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశారు.
241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది.
భారత్ 42.2 ఓవర్లలో 208 పరుగులు చేసి ఆలౌటైంది.
రోహిత్ శర్మ (64), అక్షర్ పటేల్ (44) రాణించగా, గిల్ (35) ఫర్వాలేదనిపించారు.
Details
నిరాశపరిచిన కోహ్లీ
టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(14), శివం దూబే (0), శ్రేయస్ అయ్యర్ (0) తీవ్రంగా నిరాశపరిచారు.
ఆ తర్వత వచ్చిన బ్యాటర్లు కూడా తక్కువ స్కోర్లకే పెవిలియానికి చేరడంతో టీమిండియా ఓటమిపాలైంది.
లంక బౌలర్ జెఫ్రీ వాండర్సే ఆరు వికెట్లు తీసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.