Page Loader
Kamindu Mendis: కమిందు మెండిస్‌ అద్భుత సెంచరీ.. ఒక్క శతకంతో ఐదు రికార్డులు సొంతం
కమిందు మెండిస్‌ అద్భుత సెంచరీ

Kamindu Mendis: కమిందు మెండిస్‌ అద్భుత సెంచరీ.. ఒక్క శతకంతో ఐదు రికార్డులు సొంతం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2024
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్ న్యూజిలాండ్‌తో గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో అద్భుత సెంచరీతో దుమ్మురేపాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కమిందు, 173 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 114 పరుగులు సాధించాడు. శ్రీలంక 89/3తో కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన కమిందు తన కీలక ఇన్నింగ్స్‌తో జట్టును 302 పరుగుల వరకు చేర్చాడు. ఈ ఒక్క సెంచరీతోనే కమిందు ఐదు రికార్డులను సొంతం చేసుకున్నాడు.

వివరాలు 

తొలి శ్రీలంక క్రికెటర్‌గా రికార్డు

కమిందు తన తొలి ఏడు టెస్టుల్లో ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం హాఫ్ సెంచరీ సాధించిన తొలి శ్రీలంక క్రికెటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన కమిందు, రెండో ఇన్నింగ్స్‌లో కూడా హాఫ్ సెంచరీ చేస్తే పాక్ బ్యాటర్ రికార్డును దాటిపోతాడు. ఆసియా క్రికెటర్లలో అగ్రస్థానంలో.. కమిందు ఇప్పటివరకు ఏడు టెస్టుల్లో 11 ఇన్నింగ్స్ ఆడి 809 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 80.90. ఆసియా క్రికెటర్లలో 10 ఇన్నింగ్స్‌లకు పైగా ఆడిన వారి మధ్య అతడే అత్యధిక సగటు కలిగిన క్రికెటర్. అతని తర్వాత భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ 68.53 సగటుతో రెండో స్థానంలో ఉన్నాడు.

వివరాలు 

కేన్ విలియమ్సన్‌ను మించి..

ఒక WTC సీజన్‌లో 10ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాటర్లలో అత్యుత్తమ సగటు కమిందుదే (80.90).కేన్ విలియమ్సన్ (75.2) ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. దిముత్ కరుణరత్నె రికార్డును సమం చేశాడు.. ఒక WTC సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన కమిందు,శ్రీలంక బ్యాటర్ దిముత్ కరుణరత్నె రికార్డును సమం చేశాడు.2023-25 సీజన్‌లో ఇప్పటికే నాలుగు సెంచరీలు సాధించిన కమిందు,మరో సెంచరీతో దిముత్‌ను దాటి కొత్త రికార్డు సృష్టించే అవకాశముంది. డాన్ బ్రాడ్‌మన్ సరసన.. కమిందు 11 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు శతకాలు సాధించాడు.ఈక్రమంలో వేగంగా నాలుగు సెంచరీలు చేసిన తొలి శ్రీలంక బ్యాటర్‌గా నిలిచాడు. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ కూడా తన తొలి నాలుగు శతకాలు 11ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు, దాంతో కమిందు బ్రాడ్‌మన్ సరసన చేరాడు.