Page Loader
Milan Ratnaik: టెస్టుల్లో 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక ప్లేయర్
టెస్టుల్లో 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక ప్లేయర్

Milan Ratnaik: టెస్టుల్లో 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక ప్లేయర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2024
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో శ్రీలంక ప్లేయర్ మిలన్ రత్నాయక్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. క్రీజులో ఉన్న శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వాతో కలిసి రత్నాయక్ 8వ వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలోనే 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరు(72) పరుగులు చేసిన ఆటగాడిగా మిలన్ రత్నాకర్ చరిత్ర సృష్టించారు.

Details

డెబ్యూ మ్యాచులోనే అరుదైన ఘనత

1983లో హైదరాబాద్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు చెందిన బల్వీందర్ సంధు 71 పరుగుల స్కోరు రికార్డును 41 ఏళ్ల తర్వాత మిలన్ బ్రేక్ చేశాడు. రత్నాయక్ ఈ మ్యాచులో 135 బంతుల్లో 72 పరుగులు సాధించాడు. తర్వాత యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో రత్నాయక్ ఔట్ అయ్యాడు. డెబ్యూ మ్యాచులోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గానూ చరిత్ర పుటల్లో తన పేరు నమోదు చేసుకున్నాడు.