IND vs SL : ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక గెలుపు.. పోరాడి ఓడిన భారత్
ఆసియా కప్ టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత జట్టుకు ఫైనల్లో నిరాశే మిగిలింది. ఫైనల్లో లంకేయుల చేతిలో ఓటమిపాలయ్యారు. శ్రీలంక 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లంకేయులు 8 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను చేధించి విజయం సాధించారు.
హాప్ సెంచరీలతో చెలరేగిన ఆటపట్టు, హర్షిత
శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ ఆటపట్టు 43 బంతుల్లో 61 పరుగులు, హర్షిత మాధవి 51 బంతుల్లో 69 పరుగులు చేసి లంక విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో కవిశ 30 పరుగులు వేగంగా ఆడి ఆ జట్టుకు విజయాన్ని అందించింది. భారత బౌలర్లలో దీప్తిశర్మ ఒక వికెట్ పడగొట్టింది.