LOADING...
Lanka Floods: శ్రీలంకలో ఆకస్మిక వరదల కారణంగా 56 మంది మృతి,  21 మంది గల్లంతు
శ్రీలంకలో ఆకస్మిక వరదల కారణంగా 56 మంది మృతి,  21 మంది గల్లంతు

Lanka Floods: శ్రీలంకలో ఆకస్మిక వరదల కారణంగా 56 మంది మృతి,  21 మంది గల్లంతు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుపాను కారణంగా ఆకస్మిక వరదలు వచ్చినట్లు, కొండచరియలు ధ్వంసమయ్యి 56 మంది మృతి చెందారని దేశంలోని విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు తెలిపారు. అంతేకాకుండా, మరో 21 మంది గల్లంతయ్యారని సమాచారం. వరదల ప్రభావం కారణంగా 600కి పైగా ఇళ్లు, పాఠశాలలు కూలిపోయాయి. పలు వంతెనలు ధ్వంసమయ్యి, అనేక రహదారులు,వ్యవసాయ పొలాలు నీటిలో మునిగాయి. వరదల్లో గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాలు 

రైలు సర్వీసులు కూడా నిలిపివేశారు

శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి రక్షణ చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. దేశంలోని అనేక నగరాలు వరదలో చిక్కుకుపోవడంతో, శ్రీలంక ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసింది. రైలు సర్వీసులు కూడా నిలిపివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు,విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవచ్చని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీలంకలో వరదల బీభత్సం

Advertisement