IND vs SL : నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆదివారం రెండో టీ20 ఆడనుంది. ఇప్పటికే టీమిండియా 1-0 అధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచులో లంకేయులపై 43 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఇవాళ జరిగే ఎలాగైనా గెలిచి సిరీస్ సాధించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు మొదటి మ్యాచులో జరిగిన ఘోర పరాభావానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని లంకేయులు చూస్తున్నారు.
లంకపై టీమిండియాదే పైచేయి
ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య 30 అంతర్జాతీయ టీ20 మ్యాచులు జరగ్గాయి. ఇందులో భారత్ 20 మ్యాచుల్లో నెగ్గగా, శ్రీలంక 9 మ్యాచుల్లో గెలుపొందింది. శ్రీలంక గడ్డపై ఇప్పటి వరకు జరిగిన ఆరు టీ20ల్లో టీమిండియా మూడింట్లో గెలుపొందింది. శ్రీలంక బ్యాటర్ మెండిస్ గత 10 మ్యాచ్‌లలో 144.62 స్ట్రైక్ రేట్‌తో 350 పరుగులు చేశాడు. ఇక 7 మ్యాచ్‌ల్లో నిస్సాంక 167.93 స్ట్రైక్ రేట్‌తో 220 పరుగులు చేశాడు. పతిరనా గత 9 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసి సత్తా చాటాడు.
రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం
భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 6 మ్యాచ్‌ల్లో 135.09 స్ట్రైక్ రేట్‌తో 204 పరుగులు చేశాడు. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక-భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీ లైవ్ యాప్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ప్రాబబుల్ XI శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, ర్యాన్ పరాగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ మరియు మహ్మద్ సిరాజ్.