
Srilanka: టెస్టులో శ్రీలంక అరుదైన ఘనత..48 ఏళ్ళ టీమిండియా రికార్డు బద్దలు
ఈ వార్తాకథనం ఏంటి
టెస్ట్ క్రికెట్ లో టీమిండియా పేరిట ఉన్న ఓ రికార్డును శ్రీలంక జట్టు బద్దలు కొట్టింది.
ఇన్నింగ్స్ లో ఒక్క సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
1976లో న్యూజిలాండ్ పై టీమిండియా ఇన్నింగ్స్ లో ఒక్క సెంచరీ కూడా లేకుండా 529 పరుగులు చేయగా.. ప్రస్తుతం బాంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో శ్రీలంక శతకం లేకుండా 531 పరుగులు (తోలి ఇన్నింగ్స్)చేసింది.
ఇందులో విశేషం ఏంటంటే.. ఆరుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో అలరించారు.
చివరి ఇద్దరు బ్యాటర్లు మినహా.. తొమ్మిది మందీ రెండంకెల స్కోరు చేశారు.కుశాల్ మెండిస్(93), కమిందు మెండిస్(92),కరుణరత్నె(86),ధనంజయ డిసిల్వా(70), చండిమాల్ (59), నిషాన్ మదుష్క (57) అర్ధశతకాలు సాధించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆరుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు
Sri Lanka Achieve Humongous Test Feat, Break 48-Year-Old Massive Recordhttps://t.co/naPXi5Fd41 pic.twitter.com/l39CK4iRVU
— CricketNDTV (@CricketNDTV) April 1, 2024