Page Loader
Yoshitha Rajapaksa: శ్రీలంకలో సంచలనం.. అవినీతి కేసులో మహింద రాజపక్స కుమారుడు అరెస్టు
శ్రీలంకలో సంచలనం.. అవినీతి కేసులో మహింద రాజపక్స కుమారుడు అరెస్టు

Yoshitha Rajapaksa: శ్రీలంకలో సంచలనం.. అవినీతి కేసులో మహింద రాజపక్స కుమారుడు అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స రెండో కుమారుడు యోషితా రాజపక్స అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయ్యారు. బెలియట్టా ప్రాంతంలోని తన స్వగృహంలో ఉన్న యోషితాను, ఓ ప్రాపర్టీ కొనుగోలు కేసులో జరిగిన అవకతవకల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన 2015లో మహింద రాజపక్స అధికారంలో ఉన్న సమయంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాపర్టీ వ్యవహారంలో యోషితా రాజపక్స పాత్రపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. మహింద రాజపక్స తన పదవీకాలం (2005-2015)లో తన కుమారులపై అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసు కారణంగా మహింద పెద్ద కుమారుడు నమల్ రాజపక్సను కూడా విచారించారు.

Details

చర్యలు తీసుకొనేందుకు సిద్ధంగా శ్రీలంక ప్రభుత్వం

గోవాటబయ రాజపక్సను కూడా ఈ వివాదంలో విచారణకు పిలిచారు. మహింద రాజపక్స సుప్రీంకోర్టును ఆశ్రయించి తనకు భద్రత కల్పించాలని ప్రాథమిక హక్కుల కింద పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కుమారుడి అరెస్టు శ్రీలంకలో సంచలనం రేపుతోంది. గత నవంబరులో అనుర కుమార దిశనాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. మున్ముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం సిద్ధమవుతోంది.