Holidays: ప్రపంచంలో అత్యధిక సెలవులు కలిగిన దేశాలు.. భారత్ స్థానం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగులకు సెలవులు అత్యంత ముఖ్యమైనవి. ప్రతి దేశం వారి సంస్కృతి, జాతీయోత్సవాలు, మతపరమైన సంప్రదాయాలను ఆధారంగా తీసుకుని సంవత్సరంలో నిర్దిష్ట సంఖ్యలో సెలవులను ప్రకటిస్తుంది. కొన్ని దేశాల్లో సంవత్సరంలో ఎక్కువ సెలవులు ఉంటే, మరికొన్ని దేశాల్లో తక్కువ సెలవులే ఉంటాయి. ఇప్పుడు, ప్రపంచంలోని అత్యధిక మరియు తక్కువ సెలవులు కలిగిన దేశాలు, అలాగే భారత్ స్థానం ఏమిటో చూద్దాం.
Details
అత్యధిక సెలవులు కలిగిన దేశాలు
భారతదేశం భారతదేశం ప్రపంచంలో అత్యధిక 42 సెలవులతో అగ్రస్థానంలో ఉంది. వీటిలో జాతీయ, గెజిటెడ్, రిస్ట్రిక్టెడ్, మతపరమైన, ప్రాంతీయ సెలవులు అన్నీ కలుపబడ్డాయి. ఇది భారతదేశంలోని సాంస్కృతిక వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మల్టీ-రిలీజియస్ సమాజం కావడంతో పండుగలకు గౌరవం ఇవ్వడం, రాష్ట్రాలకు వారి స్వంత సెలవులను ప్రకటించే స్వేచ్ఛ ఇచ్చడం వల్ల మొత్తం సెలవుల సంఖ్య పెరిగింది. నేపాల్ నేపాల్ 35 సెలవులతో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ముఖ్యంగా మతపరమైన పండుగలకు దీర్ఘకాలిక సెలవులు ఉంటాయి.
Details
ఇరాన్
ఇరాన్ 26 సెలవులతో మూడవ స్థానంలో ఉంది. ఇక్కడి సెలవులు ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా ఉంటాయి, ముఖ్యంగా నౌరూజ్ (ఇరానియన్ నూతన సంవత్సరం) మరియు ఇతర మతపరమైన సెలవులు. మయన్మార్ మయన్మార్‌లో కూడా 26 సెలవులు ఉన్నాయి. ఇవి ప్రధానంగా బౌద్ధ మతపరమైన పండుగలకు సంబంధించినవి, ఉదాహరణకు థింగ్యాన్ నూతన సంవత్సరం, నీటి ఉత్సవం. శ్రీలంక శ్రీలంక 25 సెలవులతో ఐదవ స్థానంలో ఉంది. దీపావళి, ఈద్, క్రిస్మస్ వంటి మతపరమైన మరియు పౌర సెలవుల సమతుల్యత ఉంది.
Details
అతి తక్కువ సెలవులు కలిగిన దేశాలు
అలాగే, కొన్ని దేశాల్లో అత్యంత తక్కువ సెలవులు ఉంటాయి. బ్రిటన్‌లో 10, నెదర్లాండ్స్‌లో 9, సెర్బియాలో 9, మెక్సికోలో 8, వియత్నాంలో 6 సెలవులు మాత్రమే ఉంటాయి. భారతదేశం సాంస్కృతిక వైవిధ్యం, మతపరమైన సమతుల్యత, రాష్ట్రాల స్వేచ్ఛ వల్ల ప్రపంచంలోనే అత్యధిక సెలవులను కలిగి ఉన్న దేశంగా నిలిచింది.