తదుపరి వార్తా కథనం

IND vs SL : శ్రీలంకతో మూడో వన్డే.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 07, 2024
05:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ భారత్ చివరి వన్డే ఆడింది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన అతిథ్య జట్టు శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
టీమిండియా బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీసి విజృంభించాడు.
లంకేయులు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేశారు.
శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక 46 పరుగులతో ఫర్వాలేదనిపించినా, అవిష్క ఫెర్నాండో (96) పరుగులతో త్రుటిలో శతకాన్ని కోల్పోయాడు.
Details
భారత విజయలక్ష్యం 249 పరుగులు
చివర్లో కుశాల్ మెండిస్ (59) హాఫ్ సెంచరీతో రాణించాడు. కమిందు మెండిస్ 23 పరుగులు చేవాడు.
లంక కెప్టెన్ అసలంక(10) మరోసారి విఫలమయ్యాడు.
సమరవీరచక్ర(0) జనిత్ లియానగే(8) తక్కువ పరుగులకే వెనుతిరిగారు.
బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ తీశారు.
భారత్ విజయానికి 249 పరుగులు అవసరం