IND vs SL : భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ టై
శ్రీలంకతో భారత్ మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డే డ్రాగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. టీమిండియా కూడా అదే స్కోరు సాధించడంతో మ్యాచ్ టై అయింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (58) హాఫ్ సెంచరీ, అక్షర్ పటేల్ (33), రాహుల్ (31) మినహా మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. 47.5 ఓవర్లో 230 పరుగులు చేసిన భారత్ ఆలౌటైంది.
క్రికెట్ చరిత్రలో 44వ టై మ్యాచ్
లంక బౌలర్లలో అసలంక, హాసరంగ తలా మూడు వికెట్లు తీసి టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లను కుప్పకూల్చారు. దునిత్ వెల్లలేగా రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించారు. భారత్ మిడిలార్డర్ బ్యాటర్లు త్వరగా పెవిలియానికి చేరుకోవడంతో ఈ మ్యాచ్ టైగా ముగిసింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 44వ టై మ్యాచ్ కావడం గమనార్హం.