T20 World Cup 2026: భారత్‌లోనే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు: ఐసీసీ నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసింది. భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనకు ఐసీసీ స్పష్టంగా తిరస్కరణ తెలిపింది. ఈ అంశంపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఓటింగ్ జరగగా, బంగ్లాదేశ్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 14 ఓట్లు పడగా, కేవలం రెండు ఓట్లే అనుకూలంగా వచ్చాయి. ఇటీవల భారత్-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, భద్రతా కారణాలను సూచిస్తూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడటం సాధ్యం కాదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) గతంలో ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే,బంగ్లాదేశ్ జట్టుకు భారత్‌లో ఎలాంటి భద్రతా సమస్యలు ఉండవని ఐసీసీ స్పష్టమైన హామీ ఇచ్చింది.
వివరాలు
నిర్ణయం మార్చుకున్న బాంగ్లాదేశ్
అయినప్పటికీ బంగ్లాదేశ్ తన వైఖరిని మార్చుకోకుండా మొండి పట్టుదల కొనసాగిస్తే, టోర్నమెంట్‌లో వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును ఆడించాల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పరిస్థితి తీవ్రతను గ్రహించిన బంగ్లాదేశ్ చివరకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారత్‌లోనే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు అంగీకరించింది.