IND vs SL: శ్రీలంక చేతిలో భారత్ ఘోర ఓటమి
శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 249 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 26.1 ఓవర్లలోనే 138 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 35 పరుగులు, విరాట్ కోహ్లీ (20), వాషింగ్టన్ సుందర్ (30) పరుగులు మినహా మిగతా బ్యాటర్లు అందరూ ఘోరంగా విఫలమయ్యారు.
2-0 తేడాతో భారత్ సిరీస్ ఓటమి
లంక బౌలర్లలో వెల్లలగే 5 వికెట్లతో చెలరేగారు. మొదటగా బ్యాటింగ్ చేసిన లంకేయులు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేశారు. ఈ ఓటమితో భారత్ 0-2 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. వన్డే సిరీస్ లో టీమిండియా వన్డేల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఫలితంగా 27 ఏళ్ల తొలిసారిగా శ్రీలంకతో జరిగిన దైపాక్షిక వన్డే సిరీస్ లో ఓటమిపాలైంది.