IND vs SL3nd ODI: మళ్లీ టాస్ గెలిచిన శ్రీలంక.. ఇరు జట్లు ఇవే
టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లలో భాగంగా శ్రీలంక టూర్ కి వెళ్లింది. ఇప్పటికే టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న, వన్డే సిరీస్‌లో భాగంగా మూడో వన్డే మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ టైగా ముగియగా, రెండో మ్యాచులో శ్రీలంక నెగ్గింది. రెండో మ్యాచులో ఓటమికి బదులు తీసుకోవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. మూడో వన్డే శ్రీలంకలోని కొలంబో వేదికగా జనగుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే
భారత్ జట్టు రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), శ్రేయాస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ శ్రీలంక జట్టు పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(సి), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో