LOADING...
Sri Lanka : శ్రీలంక జట్టుకు భారీ షాకిచ్చిన ఐసీసీ 
శ్రీలంక జట్టుకు భారీ షాకిచ్చిన ఐసీసీ

Sri Lanka : శ్రీలంక జట్టుకు భారీ షాకిచ్చిన ఐసీసీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

జింబాబ్వే పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఐసీసీ (ICC) ఒక షాక్ ఇచ్చింది. జింబాబ్వేతో శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదైనందున శ్రీలంక జట్టుకు జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఒక్క ఓవర్‌ కూడా తక్కువగా బౌలింగ్ చేసినందుకు ICC ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రవర్తనా నియమావళి (Article 2.22) ప్రకారం, ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో ప్రతి ఓవర్‌కు 5% జరిమానా విధించనున్నారు. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక ఈ నేరాన్ని అంగీకరించడంతో పాటు శిక్షను కూడా అంగీకరించగా, దీనిపై మరింత విచారణ అవసరం లేదని ICC ప్రకటించింది. సెప్టెంబర్ 9నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది.

Details

ఏడు పరుగుల తేడాతో శ్రీలంక గెలుపు

ఈ మెగాటోర్నీకి సిద్ధంగా ఉండేందుకు, శ్రీలంక జట్టు జింబాబ్వేతో పర్యటనలో ఉంది. ఇందులో జింబాబ్వేతో రెండు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి వన్డేలో, శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. జట్టులో పాతుమ్ నిస్సాంక 76, జనిత్ లియానేజ్ 70 నాటౌట్, కమిండు మెండిస్ 57 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించారు. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులకే పరిమితమైంది. దీంతో శ్రీలంక జట్టు 7 పరుగుల తేడాతో గెలుపొందింది.