IND vs SL: శ్రీలంక టూరుకు టీమిండియా.. భారత ఆటగాళ్లు సాధించిన ఘనతలివే
శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్ జులై 27 నుంచి 3 మ్యాచుల టీ20 సిరీస్‌ను ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచులు పల్లెకెలెలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే శ్రీలంక, టీమిండియా తరుపున అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పిన బ్యాటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిత్ శర్మ 43 బంతుల్లో 118 పరుగులు
2017లో ఇండోర్‌లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో భారత జట్టు 260/5 స్కోరును చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ కేవలం 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. రాహుల్ 49 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రీలకం 172 పరుగులకు ఆలౌటైంది.
మూడో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం
2017లో కొలంబోలో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టీ20లో శ్రీలంక స్కోరు 170/7 సాధించింది. దిల్షాన్ మునవీర 29 బంతుల్లో 53 పరుగులు చేశాడు. లక్ష్య చేధనలో భారత్ ఏడు వికెట్ల తేడాతో 174/3 గెలిచింది. విరాట్ కోహ్లీ, మనీష్ పాండే మూడో వికెట్‌కు 119 పరుగులు జోడించారు. కోహ్లీ అజేయంగా 82 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. పాండే 36 బంతుల్లో 51* పరుగులు చేశాడు.
11.5 ఓవర్లలో 111 పరుగులు
2022 ఫిబ్రవరి లక్నోలో జరిగిన మొదటి టీ20లో భారత్ 199/2 స్కోర్ చేసింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ 11.5 ఓవర్లలో 111 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ 32 బంతుల్లో 44 పరుగులు, కిషన్ 56 బంతుల్లో 89 పరుగులు చేశాడు. 200 పరుగుల ఛేదనలో లంక 137/6కి పరిమితమైంది,
111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన గిల్, సూర్యకుమార్ యాదవ్
2023 జనవరి రాజ్‌కోట్‌లో జరిగిన మూడవ టీ20లో భారత జట్టు 228/5 భారీ స్కోరును చేసింది. శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్‌కు 111 పరుగులను జోడించారు. గిల్ 46 పరుగుల వద్ద ఔట్ కాగా, సూర్యకుమార్ యాదవ్112 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచులో లంకేయులు 137 పరుగులకే ఆలౌటయ్యారు. 2017 ఇండోర్‌లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20లో ఉపుల్ తరంగ (47), కుసల్ పెరీరా (77) రెండో వికెట్‌కు 109 పరుగులు జోడించారు.