
Pirate attack: తమిళనాడు మత్స్యకారులపై పైరెట్స్ దాడి.. 17 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక సముద్రపు దొంగలు దాడికి పాల్పడ్డారు.
శుక్రవారం నాగపట్నం జిల్లాకు చెందిన 30 మంది మత్స్యకారులు కోరమండల్ తీరంలోని సముద్రంలో చేపలు వేటలో పాల్గొంటుండగా ఈ దాడి జరిగింది.
ఫైబర్ బోటులో వచ్చి దాడి చేసిన ఆరుగురు పైరేట్స్ (సముద్రపు దొంగలు) మత్స్యకారుల వద్ద ఉన్న విలువైన వలలు, జీపీఎస్ పరికరాలు లూటీ చేశారు.
వాటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. పదునైన ఆయుధాలతో దాడికి దిగిన ఈ దొంగలు భారత మత్స్యకారుల పడవల్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా దాడి చేసినట్లు పేర్కొనబడింది.
Details
అగ్రహం వ్యక్తం చేసిన మత్య్సకారులు
ఈ ఘటన భారత జలసరిహద్దుల్లోనే చోటుచేసుకున్నదని మత్స్యకారులు స్పష్టంగా తెలిపారు. ఘటనలో గాయపడిన 17 మందిని ఒడ్డుకు వచ్చిన తర్వాత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడిపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని, తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు మరోసారి జరుగితే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
గతేడాది డిసెంబరులో కూడా ఇలాంటి ఘటన జరిగినట్లు గుర్తు చేశారు. అప్పట్లో ముగ్గురు మత్స్యకారులు గాయపడిన సంగతి తెలిసిందే.