LOADING...
SL vs NZ: న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం
న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం

SL vs NZ: న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2024
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఐదవ రోజు న్యూజిలాండ్ ఓవర్‌నైట్ స్కోరు 207/8తో ఆటను ప్రారంభించింది. జట్టుకు ఇంకా 68 పరుగులు చేయాల్సిన అవసరం ఉండగా, శ్రీలంకకు కేవలం రెండు వికెట్లు తీస్తే విజయం లభించే స్థితి ఏర్పడింది. న్యూజిలాండ్ రైజింగ్ స్టార్ రచిన్ రవీంద్ర (92; 168 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్స్) కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ, ప్రభాత్ జయసూర్య దెబ్బకు తట్టుకోలేకపోయాడు.

Details

సొంతగడ్డపై విజయాన్ని సాధించిన శ్రీలంక

రవీంద్రను ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేసిన జయసూర్య, అదే సమయంలో కివీస్‌ విజయం ఆశలు దెబ్బతీశాడు. వెంటనే తర్వాతి ఓవర్‌లో విలియన్ రోర్కేను డకౌట్ చేసి శ్రీలంకకు విజయాన్ని అందించాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ప్రభాత్ జయసూర్య, తన బౌలింగ్‌‌తో న్యూజిలాండ్‌ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4/136తో రాణించిన అతను, రెండో ఇన్నింగ్స్‌లో 5/68 తీసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు'ను అందుకున్నాడు. అతని కృషితో శ్రీలంక సొంత గడ్డపై మరో విజయాన్ని సాధించింది.

Details

అద్భత ప్రదర్శన చేసిన ప్రభాత్ జయసూర్య

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 305 పరుగులు చేయగా, కామిందు మెండిస్ (114) శతకంతో రాణించాడు. కుశాల్ మెండిస్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్ విలియమ్ రోర్కే (5/55) ఐదు వికెట్లు తీసి రాణించాడు. న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 340 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యం సాధించింది. లాథమ్ (70), డారిల్ మిచెల్ (57), గ్లెన్ ఫిలిప్స్ (49) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. శ్రీలంక తరఫున ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీసి చక్కటి ప్రదర్శన చేశాడు. శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నె (83), చండిమల్ (61), మాథ్యూస్ (50) అర్ధశతకాలు సాధించారు. న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ (6/90) విజయవంతంగా బౌలింగ్‌ చేశాడు.