LOADING...
Ranil Wickremesinghe: శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు రాణిల్ విక్ర‌మ‌సింఘే అరెస్టు
శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు రాణిల్ విక్ర‌మ‌సింఘే అరెస్టు

Ranil Wickremesinghe: శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు రాణిల్ విక్ర‌మ‌సింఘే అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘేను (Ranil Wickremesinghe) సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయనను అదుపులోకి తీసుకున్నదృశ్యాలను స్థానిక టీవీ చానెల్ "అదా డెరనా" ఈ విషయాన్ని ప్రసారం చేసింది. ఒక కేసులో విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి హాజరైన విక్రమసింఘేను అక్కడే అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనపై ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2023లో విక్రమసింఘే లండన్ పర్యటనకు వెళ్లారు.ఆ పర్యటనకు సంబంధించి విచారణలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

వివరాలు 

వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ నిధుల ఉపయోగం 

ఆయన బ్రిటీష్ యూనివ‌ర్సిటీలో విక్ర‌మ‌సింఘే భార్య‌ను స‌త్క‌రించే కార్య‌క్ర‌మం కోసం ఆయ‌న వెళ్లారు. ప్రస్తుతం విక్రమసింఘేను కొలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ సమక్షంలో హాజరు చేయనున్నారు. అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం, వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ నిధులను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు రాణిల్ విక్ర‌మ‌సింఘే అరెస్టు