
BAN vs SL: ఆసియా కప్ టీ20లో శ్రీలంక శుభారంభం.. బంగ్లాదేశ్‌పై ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో శ్రీలంక జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. గ్రూప్ 'బి'లో శనివారం జరిగిన మ్యాచ్‌లో అసలంక సారథ్యంలోని లంక జట్టు, బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలోనే బంగ్లాదేశ్ భారీ దెబ్బతింది. ఓపెనర్లు తంజీద్ హసన్ (0), పర్వేజ్ హుసేన్ (0) డకౌట్ కావడంతో జట్టు పరుగుల ఖాతా తెరవకముందే రెండు వికెట్లు కోల్పోయింది. స్కోరు 11 పరుగులకే తౌహీద్ హృదయ్ (8) రనౌట్ కావడంతో ఒత్తిడి పెరిగింది.
Details
53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లా
ఆ తర్వాత కెప్టెన్ లిటన్ దాస్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) కొంత పోరాడినప్పటికీ, మెహదీ హసన్ (9)తో కలిసి పెవిలియన్ చేరాడు. దీంతో 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిలో షమీమ్ (34 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), జాకీర్ అలీ (34 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి అద్భుతంగా ఆడి జట్టును కాపాడారు. వికెట్ కోల్పోకుండా భాగస్వామ్యాన్ని కొనసాగించి స్కోరును 139 పరుగులకు చేర్చారు.
Details
'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా కమిల్ మిషార
సులువైన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక, 14.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (3) విఫలమైనప్పటికీ, పథుమ్ నిసాంక (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో రాణించాడు. వన్‌డౌన్ బ్యాటర్ కమిల్ మిషార (32 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం అందించాడు. తన అద్భుత ప్రదర్శనతో కమిల్ మిషార 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.