IND vs SL : క్లీన్ స్వీపే లక్ష్యంగా బరిలోకి భారత్
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక పర్యటనలో తొలి రెండు టీ20లు గెలిచిన టీమిండియా యువ జట్టు మంచి జోరు మీద ఉంది.
మంగళవారం జరిగే మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది.
కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత ప్లేయర్లు అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు.
బ్యాటింగ్‌లో యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వేగంగా పరుగులను రాబట్టుతున్నారు.
బౌలర్లలో రవి బిష్ణోణ్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
Details
ఇరు జట్లలోనే ప్లేయర్లు వీరే
మరోవైపు తొలి మ్యాచుల్లోనూ ఓడిన లంకేయులు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.
భారత్ జట్టు
జైశ్వాల్, శాంసన్, సూర్యకుమార్(కెప్టెన్), పంత్, రియాన్ పరాగ్/సుందర్, పాండ్యా, రింకు, అక్షర్, రవి బిష్ణోయ్, సిరాజ్, అర్ష్‌దీప్/ఖలీల్ అహ్మద్
శ్రీలంక జట్టు
నిశాంక, కుసాల్ మెండిస్, కుసాల్ పెరీరా, కామిందు మెండిస్, అసలంక(కెప్టెన్), దినేశ్ చండిమాల్/అవిష్క ఫెర్నాండో, హసరంగ, రమేశ్ మెండిస్, తీక్షణ, పతిరణ, అసిత పెర్నాండో.