
Pathum Nissanka : అంతర్జాతీయ టీ20లో పాతుమ్ నిస్సాంక అరుదైన రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక స్టార్ బ్యాటర్ పాతుమ్ నిస్సాంక అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక తరఫున అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ 2025లో భాగంగా సోమవారం హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులు నమోదు చేసిన నిస్సాంక ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన కుసల్ మెండిస్, కుసల్ పెరీరాలను అధిగమించాడు. ఇప్పటివరకు మెండిస్, పెరీరాలు చెరో 16 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. అయితే నిస్సాంక తాజా మ్యాచ్‌లో 17వ సారి ఈ మైలురాయిని చేరుకుని వారిని వెనక్కి నెట్టాడు.
Details
శ్రీలంక తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు
పాతుమ్ నిస్సాంక - 17 సార్లు కుసల్ మెండిస్ - 16 సార్లు కుసల్ పెరీరా - 16 సార్లు (16 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ) తిలకరత్నె దిల్షాన్ - 14 సార్లు (13 అర్థశతకాలు, 1 శతకం) మహేలా జయవర్ధనే - 10 సార్లు (9 అర్థశతకాలు, 1 శతకం)
Details
హాకాంగ్ పై శ్రీలంక విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన హాంగ్‌కాంగ్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. నిజాకత్ ఖాన్ అజేయంగా 52 పరుగులు చేసి జట్టుకు బలమైన ఇన్నింగ్స్ అందించాడు. లంక బౌలర్లలో చమీర 2 వికెట్లు తీసుకోగా, హసరంగ, ధసున్ శనక చెరో వికెట్ సాధించారు. తరువాత లక్ష్యాన్ని చేధించడంలో శ్రీలంక జట్టు బలంగా ఆడింది. నిస్సాంక 44 బంతుల్లో 68 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి హాఫ్ సెంచరీ సాధించగా, చివర్లో వనిందు హసరంగ 9 బంతుల్లో 20 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్)తో వేగంగా రాణించాడు. దీంతో శ్రీలంక జట్టు 18.5 ఓవర్లలో 150 పరుగులు చేసి విజయాన్ని కైవసం చేసుకుంది.