IND vs SL 3rd T20: సూపర్ ఓవర్ లో టీమిండియా విజయం
పల్లెకెలె వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 137 పరుగులు మాత్రమే చేసింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (39), రియాన్ (26), వాషింగ్టన్(25) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. లంకేయులు మొదట ధాటిగా ఆడిన చివర్లో తడబడటంతో ఆ జట్టు 137 పరుగులకే పరిమితమైంది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదట సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ ఆడిన లంక రెండు వికెట్లు కోల్పోయి రెండు పరుగులు మాత్రమే చేసింది.
నిరాశ పరిచిన సంజు శాంసన్
సూపర్ ఓవర్ లో తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టడంతో టీమిండియా విజయం సాధించింది. మొదట లంక బ్యాటర్లలో నిస్సాంక(26), కుశాల్ మెండిస్ (43), కుశాల్ పెరీరా (46) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3, రవి బిషోని ఓ వికెట్ చేశారు. ఇక మూడో టీ20ల్లోనూ నాలుగు బంతులు ఎదుర్కొన్న భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ డకౌట్‌తో నిరాశపరిచాడు. ఈ మూడు మ్యాచుల సిరీస్‌లో అతను రెండుసార్లు డకౌట్ కావడం గమనార్హం. టీ20 జట్టులో సుస్థిర స్థానాన్ని పొందడంలో మరోసారి సంజు శాంసన్ విఫలమయ్యాడు.