IND vs SL : శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన అతిథ్య జట్టు శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంలో టీమిండియా ముందు శ్రీలంక స్వల్ప స్కోరును ఉంచింది. లంకేయులు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేశారు. మొదటి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ నిస్సాంక ఈ మ్యాచులో డకౌట్ అయ్యాడు.
భారత విజయలక్ష్యం 241 పరుగులు
అవిష్క ఫెర్నాండో (40), కుశాల్ మెండిస్ (30), వెల్లలగే(39), కమిందు మెండిస్ 40 పరుగులతో ఫర్వాలేదనిపించారు. లంక బ్యాటర్లలో కెప్టెన్ అసలంక(25), సమరవీరచక్ర(14) జనిత్ లియానగే(12) తక్కువ పరుగులకే వెనుతిరిగారు. బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు. భారత్ విజయానికి 241 పరుగులు అవసరం