LOADING...
IND vs SL : రాణించిన బౌలర్లు.. భారత ముందు స్వల్ప టార్గెట్ 
రాణించిన బౌలర్లు.. భారత ముందు స్వల్ప టార్గెట్

IND vs SL : రాణించిన బౌలర్లు.. భారత ముందు స్వల్ప టార్గెట్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2024
06:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన అతిథ్య జట్టు శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంలో టీమిండియా ముందు శ్రీలంక స్వల్ప స్కోరును ఉంచింది. లంకేయులు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేశారు. ఓపెనర్ నిస్సాంక(56), వెల్లలగే(66*) రాణించడంతో లంక 200 ప్లస్ స్కోరును దాటింది.

Details

భారత్ విజయ లక్ష్యం 231

లంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో (1), సమరవీరచక్ర(8), కుశాల్ మెండిస్(14) తక్కువ పరుగులకే వెనుతిరిగారు. బౌలింగ్ లో అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ తీశారు. భారత్ విజయానికి 231 పరుగులు అవసరం