Page Loader
DPIFF: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు నమోదు
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు నమోదు

DPIFF: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై పోలీసులు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్నట్టుగా ప్రదర్శించడం, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, సినీపోలిస్, PVR INOX వంటి సంస్థల నుండి స్పాన్సర్‌షిప్ పొందేందుకు మోసపూరితంగా వ్యవహరించినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ మిశ్రా సహా మరికొందరు నిర్వాహకులు దాదాసాహెబ్ ఫాల్కే పేరును ఉపయోగించి అవార్డులు విక్రయించినట్టు తెలుస్తోంది. వాణిజ్యపరంగా విఫలమైన చిత్రాల నటీనటులకు కూడా అవార్డులు ఇచ్చినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. బాలీవుడ్ ప్రముఖులు ఈ ఈవెంట్‌లో పాల్గొంటారని చెప్పి, ఇందులో ప్రవేశం పొందేందుకు రూ. 2.5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

Details

ఈ వివాదం స్పందించని నిర్వాహకులు

ఈ ఫిల్మ్ ఫెస్టివల్ దేశంలో ఏకైక స్వతంత్ర అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవమని, దాదాసాహెబ్ ఫాల్కే వారసత్వాన్ని గౌరవించే ప్రతిష్ఠాత్మక వేడుకగా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ వివాదంపై DPIFF నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. DPIFF వ్యవస్థాపకుడు అనిల్ మిశ్రా, ఆయన భార్య పార్వతి మిశ్రా, కుమారుడు అభిషేక్ మిశ్రా సహా మరికొందరిపై FIR నమోదైంది. నిర్వాహకులు ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర పర్యాటక శాఖల నుండి స్పాన్సర్‌షిప్ పొందినట్టు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల నుండీ డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Details

బీజేపీ నాయకుడి ఫిర్యాదుతో కేసు నమోదు 

మహారాష్ట్ర బీజేపీ చిత్రపట్ కమగర్ అఘాడీ అధ్యక్షుడు సమీర్ దిక్షిత్ ఈ స్కామ్‌పై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాని కార్యాలయం, కేంద్ర మంత్రుల పేరును ఉపయోగించి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేశారన్నారు. పంజాబ్ టూరిజం, ఉత్తరాఖండ్ టూరిజం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల నుండి స్పాన్సర్‌షిప్ తీసుకున్నారని, అన్ని ఆధారాలను పోలీసులకు అందించామని దిక్షిత్ తెలిపారు.