LOADING...
Mumbai: 34 బాంబులు,400 కిలోల ఆర్డీఎక్స్.. 14మంది పాక్ ఉగ్రవాదులు.. బెదిరింపు మెయిల్‌తో ముంబైలో హైఅలర్ట్‌
బెదిరింపు మెయిల్‌తో ముంబైలో హైఅలర్ట్‌

Mumbai: 34 బాంబులు,400 కిలోల ఆర్డీఎక్స్.. 14మంది పాక్ ఉగ్రవాదులు.. బెదిరింపు మెయిల్‌తో ముంబైలో హైఅలర్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. ఈసారి ఆత్మాహుతి బాంబు దాడి అంటే మానవ బాంబు పేలుడు బెదిరింపు పంపించారు. ఈ సందేశం ముంబై ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నంబర్కు అందింది. వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడుతామంటూ బెదిరింపులు అందిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. 34 వాహనాల్లో మానవ బాంబులు అమర్చారని,పేలుడు జరిగితే మొత్తం ముంబై నగరం మొత్తం కదిలిపోతుందని సందేశం పేర్కొంది. 'లష్కర్-ఎ-జిహాదీ' అనే సంస్థ కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడుతారని బెదిరింపులో ప్రస్తావించారు. 14 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించి,దాడికి 400 కిలోల RDX పేలుడు పదార్థం సిద్ధం చేసారని తెలిపారు.

వివరాలు 

కోటి మంది ప్రాణాలు కోల్పోతారని సందేశం 

దీని కారణంగాకోటి మంది ప్రాణాలు కోల్పోతారని సందేశం పేర్కొంది. ఈ బెదిరింపుతో ముంబై పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ముంబైకి పెద్ద స్థాయిలో బాంబు బెదిరింపులు రావడం కొత్త విషయం కాదు.గతంలో కూడా పోలీసు కంట్రోల్ రూమ్ లేదా ఇతర పోలీస్ నంబర్లకు కాల్స్,సందేశాల ద్వారా ఇలాంటి హెచ్చరికలు చాలాసార్లు వచ్చాయి. అయితే,ఈసారి బెదిరింపు అత్యంత తీవ్రంగా ఉందని అధికారులు భావిస్తున్నారు. లక్షలాది ప్రజలను లక్ష్యంగా చేసుకుంటారని దుండగులు హెచ్చరించారు. రెండు వారాల క్రితం వర్లిలోని ఫోర్ సీజన్స్ హోటల్లో పేలుడు జరుగుతుందని హెచ్చరిక జారీ చేశారు. ఆగస్టు 14న పోలీసులకి ఫోన్ చేసి రైలులో పేలుడు జరగబోతుందని చెప్పారు.కానీ కాల్ చేసిన వ్యక్తి వెంటనే కాల్‌ను కట్ చేశాడు,సమయం, స్థలం చెప్పలేదు.

వివరాలు 

CSMT పేల్చివేస్తామని బెదిరింపులు

దర్యాప్తు చేసినప్పటికీ, ఏ అనుమానాస్పద సమాచారం లభించలేదు. పోలీసులు అసలు పరిస్థితిని గమనించి ఉపిరి పీల్చుకున్నారు. అలాగే, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)ను కూడా పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. జూలై 26న ముంబైకి మరో భయంకర హెచ్చరిక వచ్చింది. బెదిరింపు ప్రకారం, స్టేషన్‌లో బాంబు ఉంచి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తారని స్పష్టం చేశారు. ఈ సమయంలో కూడా దర్యాప్తులో పోలీసులకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.