
Malegaon blast case: మాలేగావ్ పేలుడు కేసులో.. ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
2008లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన మాలేగావ్ బాంబు పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నభోపాల్ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. గురువారం ఈ విషయమై కోర్టు తుది తీర్పును ఇచ్చింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్ 29న జరిగిన తీవ్ర బాంబు పేలుడులో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 100మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.పేలుడు ఘటన అనంతరం మొదట దర్యాప్తును చేపట్టిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్),అప్పట్లో 40వ సాక్షి సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేసింది.
వివరాలు
మొత్తం 220 మంది సాక్షులు
తరువాత ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొనసాగించింది. మొత్తం 220 మంది సాక్షులను ఈ కేసులో విచారించగా.. వారిలో 15 మంది తమ మొదటి వాంగ్మూలాలకు విరుద్ధంగా కోర్టులో కొత్తగా వాదనలు వినిపించటం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు
All 7 accused including former BJP MP Pragya Thakur acquitted in 2008 Malegaon blast case pic.twitter.com/nS6njK6x3T
— ThePrintIndia (@ThePrintIndia) July 31, 2025