Bomb Threat: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పాఠశాలకు బాంబు బెదిరింపులు
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై నగర ఆర్థిక రాజధానిలోని ఒక పాఠశాలలో బాంబు బెదిరింపు మెయిల్ (Bomb Threat)కలకలం సృష్టించింది.
జోగేశ్వరి-ఓషివారా ప్రాంతంలో ఉన్న పాఠశాల ఆవరణలో బాంబు పెట్టామనే మెసేజ్ ఇవాళ అందింది.
ఈ బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే, పాఠశాల యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని, బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆ పాఠశాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
అయితే, ఈ తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు.
ఈ బెదిరింపు మెయిల్‌ను పంపిన వ్యక్తి అఫ్జల్ గ్యాంగ్ పేరును ప్రస్తావించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ముంబైలో పాఠశాలకు బాంబు బెదిరింపులు
#WATCH | Maharashtra | A bomb threat email prompted an immediate security response at a school in the Jogeshwari-Oshiwara region of Mumbai, with local law enforcement and explosive detection personnel dispatched to conduct a thorough investigation of the premises: Mumbai Police… pic.twitter.com/jZ8gi2yz75
— ANI (@ANI) January 23, 2025