Mumbai: 9 ఏళ్ల బాలిక చెంపపై కొట్టిన ట్యూషన్ టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్‌తో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని..
9 ఏళ్ల బాలిక అల్లరి చేస్తుందని ట్యూషన్ టీచర్ కొట్టడం బాలిక ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. మహారాష్ట్రలో, ముంబైకి 58 కిలోమీటర్లు దూరంలో ఉన్న నల్లసోపరాలో చోటు చేసుకున్న ఈ సంఘటన, 9 సంవత్సరాల బాలిక గాయపడటానికి కారణమైంది. బాలిక అల్లరి చేస్తోందని, ట్యూషన్ టీచర్, ఆమె చెవికి కింద రెండుసార్లు గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. ఈ దాడి 5 అక్టోబర్ 2024న జరిగింది, అప్పటి నుంచి బాలిక దీపిక ప్రాణాపాయంతో పోరాటం చేస్తోంది. టీచర్ కొట్టిన వారం తర్వాత, దీపిక ఆరోగ్యం క్షీణించి, ఒక వారం తరువాత ఆస్పత్రిలో చేర్చబడింది.
తొమ్మిదేళ్ల బాలిక మెదడుకు తీవ్రగాయం
పోలీసుల వివరాల ప్రకారం, 20 సంవత్సరాల ప్రైవేట్ ట్యూషన్ టీచర్ రత్న సింగ్ క్లాసులో బాలికని కొట్టాడు. చెంపపై దాడి చేయడంతో, బాలిక చెవిపోగులు చెంపకు గుచ్చుకున్నాయి. తొమ్మిదేళ్ల బాలిక మెదడుకు తీవ్రగాయం కావడంతో, దవడలు-మెడలు బిగుసుకుపోవడం, ధనుర్వాతం (టెటానస్) ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ముంబైలోని సోమయ్యం ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చేరింది. గత 9 రోజులుగా బాలిక వెంటిలేటర్‌పై ఉంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ట్యూషన్ టీచర్‌కి నోటిసుచ్చి, విచారణ జరిపి, వైద్యులు అభిప్రాయం తీసుకుని చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారు.