తదుపరి వార్తా కథనం

Mumbai : ముంబైలో ఘోర విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవదహనం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 06, 2024
02:02 pm
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఆదివారం తెల్లవారుజామున బెంబూర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
ఈ విషాద ఘటనలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అధికారులు నిర్ధారించారు.
మొదట గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న షాప్‌లో మంటలు మొదలై, తర్వాత అవి వేగంగా మొదటి అంతస్తుకు వ్యాపించాయి.
Details
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ప్రమాద సమయంలో బాధితులు అందరూ గాఢ నిద్రలో ఉండటంతో, ప్రమాదం నుండి బయటపడలేకపోయారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
బాధితులను దవాఖానకు చేరకముందే మరణించినట్టు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి విచారణ చేపట్టారు.