Page Loader
CSMIA: ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. కాల్ చేసిన వ్యక్తి అరెస్టు
ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. కాల్ చేసిన వ్యక్తి అరెస్టు

CSMIA: ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. కాల్ చేసిన వ్యక్తి అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చివేస్తామంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి భయాందోళనలు కలిగించాడు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాంబు పేలుతుందని హెచ్చరించిన ఆగంతకుడు, విమానాశ్రయ భద్రతా వ్యవస్థను అలర్ట్‌ మోడ్‌లోకి నెట్టేశాడు. బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అధికారులు అత్యంత జాగ్రత్తగా మూడు గంటలపాటు విమానాశ్రయాన్నితనిఖీ చేశారు. బాంబు స్క్వాడ్ తో పాటు ఇతర భద్రతా బలగాలు కూడా అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి. విమానాశ్రయం అంతటా హై అలర్ట్ ప్రకటించారు.

వివరాలు 

MIDC పోలీసులు శీఘ్ర చర్యలు

ఈ నేపథ్యంలో, కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు MIDC పోలీసులు శీఘ్ర చర్యలు చేపట్టారు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన బెదిరింపు కాల్ తరువాత తక్కువ సమయంలోనే పోలీసులు అనుమానితుడిని పట్టుకున్నారు. 35 సంవత్సరాల వయస్సున్న మంజీత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవాడిగా గుర్తించారు. ప్రస్తుతం ముంబైలోని సకినాకా ప్రాంతంలో నివసిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం గౌతమ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ కాల్ వెనుక ఉన్న కుట్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.