LOADING...
Piyush Pandey: ప్రకటనల రూపకర్త .. పీయూష్‌ పాండే కన్నుమూత 
ప్రకటనల రూపకర్త .. పీయూష్‌ పాండే కన్నుమూత

Piyush Pandey: ప్రకటనల రూపకర్త .. పీయూష్‌ పాండే కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రకటనల రంగంలో తన ప్రత్యేక ముద్రను వేసిన ప్రముఖ వాణిజ్య ప్రకటనల నిపుణుడు పీయూష్ పాండే (70) మృతి చెందారు. కొన్ని కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండే, గత నెల రోజులుగా కోమాలో ఉన్నట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున ఆయన మరణించనట్లు ప్రముఖ ప్రకటన సంస్థ ఓగిల్వీ సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించింది. పాండే ఓగిల్వీ ఇండియాకు చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్,ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ, ఫెవికాల్, క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్‌, ఓగిల్వీ ఇండియా వంటి ప్రసిద్ధ బ్రాండ్‌లకు వినూత్నమైన ప్రచార ప్రకటనలు రూపొందించారు. ఆయన ప్రకటనల రంగంలో చేసిన కృషి, సృజనాత్మకత భారతీయ మార్కెటింగ్ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మల సీతారామన్ చేసిన ట్వీట్