
Mumbai: ముంబయిలో ఉగ్ర ముప్పు కలకలం.. అప్రమత్తమైన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉగ్ర ముప్పు హెచ్చరికల కింద ఉందని కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది.
దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమై, నగరవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ప్రార్థనా మందిరాలు, రద్దీ ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
పోలీసు అధికారులు కూడా మాక్ డ్రిల్ల్స్ నిర్వహించారని తెలిపారు. ఉన్నతాధికారులు, నగరంలోని డీసీపీలను తమ జోన్లలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు.
అనుమానాస్పద కార్యకలాపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
Details
రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు
ముఖ్యమైన ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి.
ముంబయిలోని క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాల దగ్గర మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు.
ఈ ప్రాంతంలో దుర్గాపూజా, దీపావళి వంటి పండగలు జరగనున్న కారణంగా ప్రజలకు ఉగ్ర ముప్పు హెచ్చరికలు జారీ చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలతో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.